మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Oct 02, 2020 , 02:29:16

మత్స్యకారుల అభ్యున్నతికి సర్కారు కృషి

మత్స్యకారుల అభ్యున్నతికి సర్కారు కృషి

గంగాధర: మత్స్యకారుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపూర్‌ జలాశయంలో గురువారం లక్షా 35 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్య సమీకృత అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరేళ్లుగా రాష్ట్రంలో మత్స్యసంపద గణనీయంగా పెరిగిందన్నారు. మండలంలోని చెరువులు, కుంటల్లో 2 లక్షల 46 వేల చేప పిల్లలు వదిలినట్లు తెలిపారు. ముదిరాజ్‌ కులస్తులు చేపలు పట్టడానికి వలలు, విక్రయించడానికి వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, సర్పంచ్‌ ఎండీ నజీర్‌, నాయకులు గర్వందుల పరశురాములు, ఎగుర్ల మల్లయ్య,  తదితరులున్నారు.