సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Oct 02, 2020 , 02:29:53

తొలిరోజు ఎడ్‌సెట్‌ ప్రశాంతం

తొలిరోజు ఎడ్‌సెట్‌ ప్రశాంతం

తిమ్మాపూర్‌ : బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గాను గురువారం నిర్వహించిన ఎడ్‌సెట్‌- 2020 ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. మండలంలోని వాగేశ్వరి, శ్రీ చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రెండు చొప్పున నాలుగు సెంటర్లు, కరీంనగర్‌లోని విట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, హు జూరాబాద్‌లోని కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సెంటర్లను ఏర్పాటు చేశా రు. మొత్తం ఆరు  కేంద్రాల్లో 1368 మందికి అధికారులు ఏర్పాట్లు చే యగా 1022 మం ది హాజరయ్యారు. 346 మంది గైర్హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్‌ చేశారు. ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, చేతులను శుభ్రం చేయించిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.

 ముగిసిన ఐసెట్‌.. 

ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌-2020 గురువారంతో ముగిసింది.  వాగేశ్వరి ఇంజినీరింగ్‌, శ్రీ చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల, కరీంనగర్‌లోని విట్స్‌ ఇంజినీరింగ్‌, హుజూరాబాద్‌లోని కిట్స్‌ ఇం జినీరింగ్‌ కళాశాలల్లో ఉదయం సెషన్‌లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.  థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, చేతులను శుభ్రం చేయించిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఆరు కేంద్రాల్లో 1627 మందికి ఏర్పాట్లు చేయగా 1444 మంది హాజరు కాగా, 183 మం ది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.