మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Oct 01, 2020 , 04:51:54

ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత సాయం ఒక్కరోజే 7 కోట్లు

ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత సాయం ఒక్కరోజే 7 కోట్లు

  • ఉమ్మడి జిల్లాలో 695 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ
  • రామగుండంలో 4.76 కోట్లు.. జగిత్యాలలో 2.15 కోట్ల విలువైన చెక్కులు అందజేత 

గోదావరిఖని/జగిత్యాల రూరల్‌: పేదింట ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాష్ట్ర సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున సాయం చేస్తున్నది. బుధవారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 7 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను అందజేసింది. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కా ర్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ రామ గుండం మండలంలోని 479 మంది లబ్ధిదారులకు 4.76 కోట్లు, జగిత్యాలలోని బంగారి గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌   జగిత్యాల పట్టణం, అర్బన్‌ మండలాలకు చెందిన 216 మందికి 2.15కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులను అందుకొని హర్షం వ్యక్తం చేశా రు.

 గోదావరిఖనిలో రామగుండం మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యు డు దివాకర్‌, కార్పొరేటర్లు శ్రీనివా స్‌, జ్యోతి రమేశ్‌, శంకర్‌, స్వరూప రామస్వామి, శ్రీనివాస్‌, రమణారెడ్డి, కృష్ణవేణి, అడ్డాల గట్టయ్య, సతీశ్‌, అఫ్రిన్‌ ఫాతిమా, వేణు, శ్రీనివాస్‌, పులెంధర్‌, భాస్కర్‌, రాజ్‌కుమార్‌, దయాకర్‌, సరోజన కనుకయ్య, మహాలక్ష్మీ తిరుపతి, పద్మ గణేశ్‌, శంకర్‌ నాయక్‌, అంజలి  ఉన్నారు. జగిత్యాలలో ఆర్డీవో మాధురి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర్‌రావు, జడ్పీటీసీ మహేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు సతీశ్‌, టీఆర్‌ఎస్‌వై జిల్లా, పట్టణాధ్యక్షులు దావ సురేశ్‌, కత్రోజి గిరి,  నేతలు ఆనంద్‌రావు, మహేశ్‌, బోగ ప్రవీణ్‌ ఉన్నారు.

  కన్నీళ్లు తుడిచేందుకే.. : ఎమ్మెల్యే చందర్‌

ఆడబిడ్డల కష్టాలు, కన్నీళ్లను తుడిచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు అనుకరిస్తున్నాయంటే ఆ గొప్పతనం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సింగరేణి స్థలాల్లో నివాసాలకు పట్టాల కోసం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి మంజూరు కోసం 76 జీవోను అమలు చేయించామన్నారు. ఇక్కడి 27వేల నివాసాలకు పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పించేందుకు పాటు పడుతున్నామన్నారు. రామగుండంలోని 1,20, 21 డివిజన్లలోని జెన్‌కో స్థలాల నివాసాలకు కూడా క్రమబద్ధీకరణకు సీఎంను కోరామన్నారు. అంతర్గాంలోని వీవింగ్‌, స్పిన్నింగ్‌ భూ ముల స్థలంలో ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ఏర్పాట్లు పూర్తి చేశామనీ, త్వరలోనే వాటి పనులు ప్రారంభమవుతాయన్నారు. 

పేదల సంక్షేమం కోసమే: ఎమ్మెల్యే సంజయ్‌ 

పేదల సంక్షేమమే లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని జ గిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. దేశంలో ఏక్కడా లేని విధంగా నిరుపేద యువతుల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎక్కడైనా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీలో జాప్యం జరిగితే తన దృష్టికి తేవాలని సూచించారు.