ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Sep 29, 2020 , 02:10:44

వివరాలు పారదర్శకంగా సేకరించాలి

వివరాలు పారదర్శకంగా సేకరించాలి

  • n  మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి 
  • n  ధరణి వివరాల సర్వేపై సిబ్బందికి అవగాహన
  • n  పలుగ్రామాల్లో ప్రారంభం

పెద్దపల్లి జంక్షన్‌/పెద్దపల్లి టౌన్‌: ధరణి పోర్టల్‌లో నమోదుకు పట్టణంలోని వ్యవసాయేతర భూముల వివరాలను పారదర్శకంగా సేకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ తిరుపతి సర్వే సిబ్బందికి సూచించారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయేతర భూముల వివరాల సేకరణ, ధరణి పోర్టల్‌లో నమోదుపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటా వివరాలు సేకరించాలని సూచించారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. కాగా పట్టణంలో సర్వేను ప్రారంభించారు. ఇక్కడ మున్సిపల్‌ మేనేజర్‌ నయీం షా ఖాద్రీ, ఆర్‌ఐ శివప్రసాద్‌, మున్సిపల్‌ సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దపల్లి రూరల్‌: అప్పన్నపేట గ్రామంలో మండల పంచాయతీ అధికారి సుదర్శన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఇండ్ల కొలతలు చేపట్టారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో సర్పంచ్‌ చీకటి స్వరూప, పోచాలు ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, కార్యదర్శులున్నారు. 

ఓదెల: మండలంలోని అన్ని గ్రామాల్లోని ఇండ్లు, ఖాళీ స్థలాల వివరాలను సిబ్బంది సేకరించారు. కాగా ధరణి కార్యక్రమం బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జూలపల్లి: మండలకేంద్రంలో వ్యవసాయేతర కట్టడాల వివరాల సేకరణ సర్వేను ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌ సోమవారం ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం చుట్టూ కొలతలు తీసి వివరాలు నమోదు వేశారు. ఇక్కడ సర్పంచ్‌ దారబోయిన నరసింహం, ఎంపీటీసీ అమరగాని మమత, ఉప సర్పంచ్‌ కొప్పుల మహేశ్‌, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, నాయకులు శాతళ్ల కాంతయ్య, చొప్పరి శేఖర్‌, మల్లెత్తుల కనకయ్య, తాటిపెల్లి రాయలింగం పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ సర్వేపై జూలపల్లి గ్రామస్తులకు ఎంపీడీవో వెంకటేశ్‌ సోమవారం అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపీవో వాజిద్‌, సర్పంచ్‌ బొల్లపల్లి శంకర్‌ గౌడ్‌, ఎంపీటీసీ శంకరయ్య, వార్డు సభ్యులు తదితరులున్నారు.