మంగళవారం 20 అక్టోబర్ 2020
Peddapalli - Sep 29, 2020 , 02:10:44

విద్యాభివృద్ధికి ఎన్టీపీసీ కృషి

విద్యాభివృద్ధికి ఎన్టీపీసీ కృషి

  • ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ 

జ్యోతినగర్‌: విద్యాభివృద్ధికి ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చేస్తున్నదని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీపీసీ ఈడీసీ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.  ఈ సందర్భంగా అందజేసి మాట్లాడారు. ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా చేపట్టిందని తెలిపారు. సీఎస్‌ఆర్‌ నిధులు రూ.18.20లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ పుస్తకాలను రామగుండం ఉమ్మడి మండలంలోని 118 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేయనున్నట్లు వివరించారు. టీటీఎస్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులకు 62,600 పుస్తకాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఎన్టీపీసీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్సీ జీఎం అభయ్‌కుమార్‌ సమయార్‌,  ఏజీఎం (హెచ్‌ఆర్‌ సీఎస్‌ఆర్‌) రఫిక్‌ ఉల్‌ ఇస్లాం, సీనియర్‌ మేనేజర్‌(పీఆర్వో) సహదేవ్‌, ఎన్టీపీసీ దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు సాధన రాజ్‌కుమార్‌, మండల విద్యాధికారి డానియెల్‌, సీఎస్‌ఆర్‌  అధికారులు వేముగంటి యుగేంధర్‌రావు, ప్రసాద్‌రావు తదితరులు ఉన్నారు. 

మోడల్‌ సీసీ కెమెరాలు ప్రారంభం

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ టౌన్‌షిప్‌ గేట్‌లో మోడల్‌ సీసీ కెమెరాలను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ ప్రారంభించారు. ఇక్కడ ఎన్టీపీసీ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్సీ జీఎం అభయ్‌కుమార్‌ సమయార్‌, టెక్నికల్‌ సర్వీసెస్‌ జీఎం పీకే లాడ్‌, ఏజీఎం(సీఎస్‌ఆర్‌, హెచ్‌ఆర్‌) రఫిక్‌ ఉల్‌ ఇస్లాం ఉన్నారు.logo