శనివారం 24 అక్టోబర్ 2020
Peddapalli - Sep 29, 2020 , 02:10:45

రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి

రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి

  • n  అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
  • n  పలు గ్రామాల్లో పర్యటన

కాల్వశ్రీరాంపూర్‌: రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.  సోమవారం ఆయన మండలకేంద్రంతోపాటు, కిష్టంపేట, కూనారం, పెగడపల్లి, పందిల్ల గ్రామాల్లో పర్యటించి రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మా ట్లాడుతూ, దసరాలోగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేసే లా చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధుల ను ఆదేశించారు. ఇందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ఆయనవెంట ఎంపీడీవో కిషన్‌, సర్పంచులు డొనికెన విజయ, ఆరెల్లి సుజాత, దాసరి లావణ్య, ఆడెపు శ్రీదేవి, ఏవో నాగార్జున , ఏఈవోలు చీర్లంచ రమేశ్‌, ముస్కె రమేశ్‌, ఎర్ర రాజు, పూర్ణచందర్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఈజీఎస్‌ టీఎ రంజిత్‌, ఆర్బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ నిదానపురం దేవయ్య, పీఆర్‌ డీఈ దేవేందర్‌, ఏఈ మల్లేశంతోపాటు పలువురు పాల్గొన్నారు. 

పనుల పరిశీలన

ఓదెల: గుంపుల, పొత్కపల్లి, గుండ్లపల్లి, కొలనూర్‌ గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. ఆయనవెంట ఎంపీడీవో సత్తయ్య, సర్పంచులు ఆళ్ల రాజిరెడ్డి, తిప్పారపు చిరంజీవి, పులుగు తిరుపతిరెడ్డి, సామ మణెమ్మ, పీఆర్‌ఏఈ జిన్న సమ్మిరెడ్డి తదితరులు ఉన్నారు.  



logo