సోమవారం 26 అక్టోబర్ 2020
Peddapalli - Sep 27, 2020 , 02:12:46

ర్యాలీలను విజయవంతం చేయాలి

ర్యాలీలను విజయవంతం చేయాలి

గోదావరిఖని/జ్యోతినగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం అమలును స్వాగతిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రైతులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ట్రాక్టర్లతో ఆదివారం భారీ ర్యాలీ చేపట్టనున్నారు. రామగుండంలోని బీ పవర్‌హౌస్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ ఎన్టీపీసీ, మున్సిపల్‌ చౌరస్తా, ప్రధాన చౌరస్తా, ఫైవింక్లయిన్‌, తిలక్‌నగర్‌ మీదుగా గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్‌ స్టేడియం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి ఎంపీ వెంకటేశ్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌  కానున్నారు. అనంతరం సింగరేణి స్టేడియంలో ప్రత్యేక సభలో నిర్వహించనున్నారు.

ధర్మారం: మండలకేంద్రంలో ఆదివారం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్‌ చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఈ ర్యాలీని ప్రారంభిస్తారని, అక్కడి నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు పాదయాత్రగా వస్తారని వారు వివరించారు. అనంతరం ట్రాక్టర్ల ర్యాలీతో ధర్మపురి నియోజకవర్గ కేంద్రానికి తరలివెళ్లనున్నట్లు వివరించారు. ర్యాలీకి మండలంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు భారీసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని  కోరారు. 

పాలకుర్తి: రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ర్యాలీకి  మండలం నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మగాని తిరుపతిగౌడ్‌ కోరారు. వేంనూర్‌ గ్రామం నుంచి కుక్కలగూడూర్‌, గుడిపల్లి, జయ్యారం, పుట్నూర్‌ మీదుగా, రామారావుపల్లి, కొత్తపల్లి, ఈసాలతక్కళ్లపల్లి, పాలకుర్తి, బసంత్‌నగర్‌ గ్రామాల రైతులు వారివారి ట్రాక్టర్లతో ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి ర్యాలీగా గోదావరిఖని ఎల్బీ నగర్‌ స్టేడియంలో జరిగే సభకు తరలివెళ్లనున్నట్లు వివరించారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.


logo