సోమవారం 26 అక్టోబర్ 2020
Peddapalli - Sep 27, 2020 , 02:12:48

నిత్యావసర సరుకులు పంపిణీ

నిత్యావసర సరుకులు పంపిణీ

ఫర్టిలైజర్‌సిటీ: బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 50మంది న్యాయవాదులకు శనివారం బియ్యం పంపిణీ చేశారు. శనివారం గోదావరిఖని ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి భారతీలక్ష్మి, మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ పర్వతపు రవి హాజరై న్యాయవాదులకు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, కరోనా వల్ల న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి బియ్యం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు ముందుకువచ్చిన సీనియర్‌ న్యాయవాదులు బల్మూరి అమరేందర్‌రావు, సుధాకర్‌రెడ్డి, సోగాల కుమార్‌, సంజయ్‌కుమార్‌ను ఆమె అభినందించారు. ఇక్కడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేడ చక్రపాణి, ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు భూమయ్య, రాజేందర్‌తోపాటు న్యాయవాదులున్నారు.

లయన్స్‌ క్లబ్‌ ఎలైట్‌ పెద్దపల్లి ఆధ్వర్యంలో 

పెద్దపల్లి రూరల్‌: లయన్స్‌ క్లబ్‌ ఎలైట్‌ పెద్దపల్లి ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామంలోని ఐదు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌ కోశాధికారి పొల్సాని సంపత్‌రావు బర్త్‌ డేను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం గ్రామస్తులకు హోమియోపతి మందులు, మాస్కులు, గ్రామపంచాయతీ కార్మికులకు ఫేస్‌ షీల్డ్‌ మాస్కులను పంపిణీ చేశారు. అలాగే హన్మంతునిపేటలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కనపర్తి శ్రీలేఖ, ప్రభాకర్‌రావు, లయన్స్‌ క్లబ్‌ ఎలైట్‌ పెద్దపల్లి అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌కుమార్‌, కార్యదర్శి చంద్రగిరి వంశీరాజ్‌, కోశాధికారి పొల్సాని సంపత్‌రావు, ఉపాధ్యక్షుడు మిట్టపల్లి రవీందర్‌, సహాయ కార్యదర్శి  శ్రీధర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo