శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Sep 27, 2020 , 02:12:50

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

  • n  పలు సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు
  • n  నివాళులర్పించిన టీఆర్‌ఎస్‌ నాయకులు  

పెద్దపల్లి జంక్షన్‌: పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తిలక్‌నగర్‌లోని చాకలి ఐల మ్మ విగ్రహానికి ఆ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ రజక సంఘం గౌరవ అధ్యక్షు డు బొడ్డుపల్లి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు పురుషోత్తం,  భూతగ డ్డ సంపత్‌, నాయకులు రాచమల్ల శ్రీనివాస్‌, బొడ్డుపల్లి అశోక్‌, మొండయ్య, మల్లికార్జున్‌, శ్రీనివాస్‌, స్వామి, లక్ష్మ ణ్‌, కుమారస్వామి, సుమంత్‌, కృష్ణ, తిరుపతి, రమేశ్‌, శ్రీనివాస్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

మంథని టౌన్‌:  మంథనిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి ఎంపీపీ కొండా శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గర్రెపల్లి సత్యనారాయణ, కో-ఆప్షన్‌ సభ్యుడు యాకు బ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బత్తుల సత్యనారాయణ, ఆకుల కిరణ్‌, గొబ్బూరి వంశీ, అడిచర్ల సమ్మయ్య, సామ్రాట్‌, రజక సంఘం నాయకులు పోతరాజు సమ్మయ్య, శ్రీనివాస్‌, లింగయ్య, సమ్మయ్య పాల్గొన్నారు. 

రామగిరి: టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో సెంటినరీకాలనీలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కమాన్‌పూర్‌ ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌ హాజరై నివాళులర్పించారు. అలాగే ముస్త్యాలలో సర్పంచ్‌ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో జీపీ కార్యాలయ ఆవరణ లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు గారబోయిన నరేశ్‌యాదవ్‌, ఏఎంసీ డైరెక్టర్లు బేతు కుమార్‌, ఆసం తిరుపతి, ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్‌, నాయకులు కాపురబోయిన భాస్కర్‌, రవి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌: తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి ఆధ్వర్యంలో మంగపేటలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఆ సంఘం జిల్లా మీడియా సెక్రటరీ గూడెపు కిరణ్‌ ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఇక్కడ ఆ సంఘం నాయకులున్నారు.

జూలపల్లి: మండలకేంద్రంలో రజక సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఇక్క డ ఆ సంఘం గ్రామ అధ్యక్షడు గంగిపల్లి భూమయ్య, నా యకులు గంగిపల్లి శ్రీనివాస్‌, మల్లయ్య, రాజేశం, సంపత్‌, సతీశ్‌, అజయ్‌, వెంకటేశ్‌, లక్ష్మీనారాయణ, చంద్రయ్య, నర్సయ్య తదితరులు ఉన్నారు. 

ఫర్టిలైజర్‌సిటీ: తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి ఆధ్వర్యంలో నగరంలోని లేబర్‌కోర్టు సమీపంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఇక్కడ నాయకులు ముక్కెర రాజేశం, శ్రీనివాస్‌, కాసర్ల సంపత్‌, కాసర్ల సురేశ్‌, నర్సయ్య, నరేశ్‌, రవి, కోడిపుంజుల మధు, కట్కూరి రణదేవ్‌, ముక్కెర భూమయ్య, ఆశ, ఎల్లక్క, ఓదక్క, యాదగిరి, శ్రీనివాస్‌ తదితరులున్నారు.