గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Sep 26, 2020 , 02:04:26

సీఎంఆర్‌ బియ్యం సరఫరా పూర్తి చేయాలి

సీఎంఆర్‌ బియ్యం సరఫరా పూర్తి చేయాలి

  • n  జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హోళికేరి 
  • n  పలు రైస్‌ మిల్లుల సందర్శన

పెద్దపల్లిరూరల్‌/సుల్తానాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సీఎంఆర్‌ బియ్యం సరఫరా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల, పెద్దబొంకూరు శివారుల్లోని రాఘవేంద్ర, హనుమాన్‌, రాధాకృష్ణ రైస్‌మిల్లులను, సుల్తానాబాద్‌ మండలంలోని కనకమహాలక్ష్మి, శివశంకర్‌, భవాని, సీతారామయ్య, సీతారామాంజనేయ రైస్‌ మిల్లులను శుక్రవారం ఆమె అదనపు కలెక్టర్‌, సంబంధిత శాఖ అధికారులతో కలిసి సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా భారతీ హోళికేరి మాట్లాడుతూ.. వానకాలానికి సంబంధించిన సీఎంఆర్‌ లక్ష్యాన్ని ఈనెల 30వ తేదీలోగా డెలివరీ చే యాలని మిల్లర్లను ఆదేశించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి తోట వెంకటేశం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ తహసీల్దార్లు దుర్శేట్టి శ్రీనివాస్‌, పాల్‌ సింగ్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది ఉన్నారు.