మంగళవారం 27 అక్టోబర్ 2020
Peddapalli - Sep 25, 2020 , 02:28:01

రెవెన్యూ చట్టం దేశానికే దిక్సూచి

రెవెన్యూ చట్టం దేశానికే దిక్సూచి

  • nచరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది
  • nఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  • nగంగాధరలో కొత్త రెవెన్యూ చట్టంపై ట్రాక్టర్లతో కృతజ్ఞత ర్యాలీ

గంగాధర: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం దేశానికే దిక్సూచిగా మారుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం  మధురానగర్‌ చౌరస్తాలో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 500లకు పైగా ట్రాక్టర్లు, 50 ఎడ్ల బండ్లతో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు ర్యాలీకి తరలివచ్చారు. కురిక్యాల నుంచి మధురానగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ట్రాక్టర్‌ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మధురానగర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు, నాయకులు సంబురాలు చేసుకుంటూ నృత్యాలు చేయగా, ఎమ్మెల్యే వారితో కలిసి స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్‌ 9, 2020 చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి అన్నదాత బాధలను తీర్చిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు, సింగిల్‌ విండో చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గంగాధర తరలిన ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ శ్రేణులు

 చొప్పదండి: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం చరిత్రాత్మకమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. గంగాధరలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీకి  స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులతో  కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ తహసీల్దార్‌ కార్యాలయాలు, వీఆర్వోల చుట్టూ రైతులు రోజుల తరబడి తిరిగినా భూసమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపాలనే ఉద్దేశంతో గంగాధరలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 

  ముఖ్యమంత్రి కటౌట్‌తో ర్యాలీ 

 టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గడ్డం చుక్కారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బారీ కటౌట్‌తో పార్టీ మండల శ్రేణులు ట్రాక్టర్ల ర్యాలీకి తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌  ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.  

రామడుగు: గంగాధరలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీకి మండలం నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సుమారు రెండు వందల ట్రాక్టర్లతో ప్రజాప్రతినిధులు, నాయకులు ర్యాలీగా తరలి వెళ్లగా, మండల ప్రజలు  గ్రామ గ్రామాన జనహారతి పట్టారు. ఉదయం 11 గంటలకు అన్ని గ్రామాల నుంచి వెదిర క్రాస్‌రోడ్డుకు ట్రాక్టర్లతో ర్యాలీగా చేరుకొని, అక్కడి నుంచి  గంగాధరకు తరలి వెళ్లారు. ట్రాక్టర్లు వరుసగా గంగాధర బాట పట్టగా జాతీయ రహదారి గులాబీమయమైంది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, ఆర్బీఎస్‌ మండల కో-ఆర్డినేటర్‌ జూపాక కరుణాకర్‌, ఆర్బీఎస్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ గర్రెపెల్లి కరుణాకర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ గంట్ల రవీందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తడగొండ అజయ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ఆర్బీఎస్‌ గ్రామ కో-ఆర్డినేటర్లు, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు వీర్ల రవీందర్‌రావు, సంజీవరావు, కలిగేటి లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.logo