ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Sep 24, 2020 , 01:38:24

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి

  • n దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
  • n మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • n 32 మందికి బ్యాటరీతో  నడిచే మోటార్‌ సైకిళ్ల పంపిణీ
  • n అక్కపెల్లి చెరువులో  3లక్షల 26వేల చేప పిల్లల విడుదల

ధర్మపురి: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లా లని, వారి సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 32 మంది దివ్యాంగులకు బుధవారం ఏడీఐపీ పథకం ద్వారా మంజూరైన బ్యాటరీతో నడిచే మోటారు సైకిళ్లను ధర్మపురి ఏఎంసీ ప్రాంగణంలో ఉచితంగా అందజేశారు. ధర్మపురి శివారులోని అక్కపెల్లి చెరువులో 3లక్షల 26వేల చేపపిల్లలను ఆయన వదిలారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ, దివ్యాంగులకు సామాజిక భద్రత, గౌరవంతో కూడిన జీవితాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వారికి ఏ ఆపద వచ్చినా తనకు స్వయంగా ఫోన్‌ చేయాలన్నారు. ఏ అర్ధరాత్రయినా స్పందిస్తానన్నారు. వారికి సేవ చేయడం ఆ భగవంతుడికి చేసే సేవలా భావిస్తానన్నారు.  గతంలో అం దించిన సైకిళ్లు కాకుండా బ్యాటరీతో నడిచే ఒక్కో సైకిల్‌కు రూ.37వేలు వెచ్చించి అందజేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 389 మంది దివ్యాంగులకు ఈ సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలో ఫైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించామని, విడుతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అం దిస్తామన్నారు. ఎల్‌ఎమ్‌ కొప్పుల చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో గతంలో చాలా మంది దివ్యాంగులకు ట్రైసెకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు, సంక కర్రలు అందజేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకే మొదటి ప్రాధాన్యమిస్తున్నామని పునరుద్ఘాటించారు. ధర్మపురిలో గతంలో దివ్యాంగుల శిబిరం ఏర్పాటు చేసిన సమయంలో దివ్యాంగుల నుంచి వచ్చిన 1,400 దరఖాస్తులు స్వీకరించి అందరి సమస్య లు పరిష్కరించామన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కులవృత్తుల అభివృద్ధ్దిపై దృష్టిసారించారని, ముఖ్యంగా మత్స్య రంగం దశ తిరిగిందిన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రాను తలదన్నే విధంగా తెలంగాణ ఫిష్‌హబ్‌గా మారనున్నదన్నారు. కాగా మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేర కు గిఫ్ట్‌ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి మండల ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఎల్‌ఎమ్‌ కొప్పుల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కొనుగోలు చేసిన అంబులెన్స్‌ వాహనాన్ని మంత్రి ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్‌ రాజేశ్‌కుమార్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య, జిల్లా సంక్షేమాధికారి నరేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సౌళ్ల నరేశ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అక్కనపల్లి సునీల్‌కుమార్‌ తదితరులున్నారు.

మంత్రి ఈశ్వర్‌ సార్‌కు కృతజ్ఞతలు

మాది పేద కుటుంబం. వీల్‌ చైర్‌ కొనుక్కుందామన్న పైసల్లేవు. ఎక్కడి కైనా వెళ్దామంటే కష్టమయ్యేది. ఇదివరకే మంత్రి ఈశ్వర్‌ సారు వీల్‌చైర్‌ ఇచ్చిండు. ఇప్పుడు బ్యాటరీతో నడిచే మోటార్‌ సైకిల్‌ ఇచ్చిండు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్‌ చేయమన్నడు. మంత్రి ఈశ్వర్‌ సారుకు కృతజ్ఞతలు.   

- వేముల సత్తయ్య, ధమ్మన్నపేట, ధర్మపురి

సారు సల్లగుండాలె

మంత్రి ఈశ్వర్‌ సారును బతికున్నంత వరకు మరువను. నాకు పోలియో సోకి కాలు చచ్చుబడింది. నాపై దయ జూపి సారు నాకు బ్యాటరీ మోటర్‌ సైకిల్‌ అందజేసిండు. ఏదన్న ఆపదొత్తె డైరెక్టుగా ఫోన్‌ జేయమన్నడు. దేవుడి ఆశీస్సులతో సారు సల్లగుండాలె.

- తుమ్మ విజయలక్ష్మి, జైన, ధర్మపురి