గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Sep 24, 2020 , 01:38:26

హ్యాపీబర్త్‌డే చందర్‌

హ్యాపీబర్త్‌డే చందర్‌

  • ఎమ్మెల్యే కోరుకంటికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

గోదావరిఖని: రామగుండం ఎమ్మె ల్యే కోరుకంటి చందర్‌కు మంత్రి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చందర్‌ తన పుట్టినరోజు ను పురస్కరించుకుని బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో అమాత్యుడు రామన్నను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చేందుకు పది కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. స్పందించిన కేటీఆర్‌ రామగుండంలో ఐటీపార్కు ఏర్పాటుకు హామీ ఇచ్చారని చందర్‌ తెలిపారు. అలాగే మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తో కలిసి ఎమ్మెల్యే చందర్‌ కేక్‌ను కట్‌ చేశారు.