శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Sep 24, 2020 , 01:38:26

గ్రీన్‌చాలెంజ్‌లో కోరుకంటి

గ్రీన్‌చాలెంజ్‌లో కోరుకంటి

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ బుధవారం ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని చాలెంజ్‌ విసిరారు. ఈ చాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో కొడుకు మణిదీప్‌, కుమార్తె ఉజ్వలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్‌ మాట్లాడుతూ.. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. వాతావరణ సమతుల్యతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. దీనికోసం ప్రజలందరూ విరివిగా మొక్కలను నాటాలని కోరారు.