శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Sep 24, 2020 , 01:38:32

‘కల్యాణలక్ష్మి’తో పేదింటి ఆడబిడ్డలకు భరోసా

 ‘కల్యాణలక్ష్మి’తో పేదింటి ఆడబిడ్డలకు భరోసా

  •  n రాష్ట్ర  మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  •  n 150 మంది లబ్ధిదారులకు    రూ. కోటీ  50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

వెల్గటూర్‌: పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆడబిడ్డలకు ఎంతగానో భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బుధవారం వెల్గటూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మండలానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 50 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలబడి, వారి పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం కింద ఆడబిడ్డ వివాహానికి అందించే సహాయాన్ని రూ.51వేలతో ప్రారంభించి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రూ.1,00,116కు పెంచారన్నారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లలు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకొని అవస్థలు పడే పరిస్థితి నుంచి బయట పడుతున్నారన్నారు. అనంతరం స్తంభంపల్లి శివారులో బీసీ గురుకుల పాఠశాల, హోటల్‌ హరిత, అంబేద్కర్‌ విజ్ఞాన్‌ భవన్‌ నిర్మాణాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట మండల నాయకులు తదితరులున్నారు.

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రారంభం

ధర్మపురి: ధర్మపురి పట్టణంలో 5 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను  మంత్రి ఈశ్వర్‌ బుధవారం  ప్రారంభించారు.  అధికలోడ్‌తో  విద్యుత్‌ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి ఈశ్వర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని 10 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయించారు. ఇందులో మొదటి విడుతగా పూర్తయిన 5 ట్రాన్స్‌ఫార్మర్లను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఈ జవహర్‌నాయక్‌, ఏఈ మనోహర్‌ తదితరులున్నారు.

ఎల్‌వోసీకి అభయమిచ్చిన మంత్రి  

గొల్లపల్లి: గొల్లపల్లి మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బ హన్మాండ్లు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్‌వోసీ కోసం బుధవారం కరీంనగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిశారు. పబ్బ హన్మాండ్లుకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయింది. దీంతో వైద్య ఖర్చుల కోసం రూ. 1.50 లక్షలు ఎల్‌వోసీ కావాలని మంత్రిని కోరాడు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎల్‌వోసీ అందేలా చూస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు.