బుధవారం 28 అక్టోబర్ 2020
Peddapalli - Sep 22, 2020 , 02:14:40

ఆర్థికసాయం అందజేత

ఆర్థికసాయం అందజేత

  •   దాతలు ఆదుకోవాలని బాధితలు వేడుకోలు

పెద్దపల్లి జంక్షన్‌: క్యాన్సర్‌తో బాధపడుతున్న పట్టణానికి చెందిన అడిచెర్ల మల్లేశంకు నల్లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. బాధితుడిని ఆ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా మనోహర్‌రెడ్డి సోమవారం పరామర్శించి రూ.5వేలు ఆర్థికసాయం చేశారు. మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనవెంట కాచాపూర్‌ సర్పంచ్‌ బంటు ఎల్లయ్య, ఫౌండేషన్‌ సభ్యులు రవితేజ, బషీర్‌, షకీల్‌, సంతోష్‌, వసీం తదితరులున్నారు.

లయన్స్‌ క్లబ్‌ పెద్దపల్లి ఎలైట్‌ ఆధ్వర్యంలో 

పట్టణంలోని టీచర్‌ కాలనీకి చెందిన మేకల జంపన్న కూతురు స్ఫూర్తి బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నది. విషయం తెలుసు కున్న స్థానిక లయన్స్‌ క్లబ్‌ సభ్యులు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ పెద్దపల్లి ఎలైట్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ వెంకట్‌, లయన్స్‌ క్లబ్‌ సిరిసిల్ల వారి సహకారంతో రూ.20వేల నగదును బాలిక తల్లిదండ్రులకు అందించారు. దాతలు సహకరించి బాలికను ఆదుకోవాలని ఈ సందర్భంగా లయన్స్‌ సభ్యులు కోరారు. 73969 03383 నంబర్‌కు ఫోన్‌పే/ గూగుల్‌ పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు అశోక్‌ కమార్‌, వంశీరాజ్‌, సంపత్‌రావు, జైపాల్‌రెడ్డి, కంకటి శ్రీనివాస్‌, వెంకట్‌, మిట్టపల్లి రవీందర్‌, అనిల్‌, కుమార్‌, సతీశ్‌, శ్రీనివాస్‌చారి, శ్రీమాన్‌ తదితరులున్నారు.logo