సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Sep 22, 2020 , 02:14:42

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

  • n  రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపద
  • n  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • n  మంథనిలో చేప పిల్లల పంపణీ

మంథని టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను మంథని శివారులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని 8,93,7 52 చేపపిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు.  కేసీఆర్‌ ముందుచూపుతూ రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు వీకే  రవి, కుర్రు లింగయ్య, గర్రెపల్లి సత్యనారాయ ణ, శ్రీపతి బానయ్య, కో-ఆప్షన్‌ సభ్యుడు యాకుబ్‌, నాయకులు కుంట శ్రీనివాస్‌, బత్తుల సత్యనారాయణ, వేల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ, ఎంఎస్‌  పాపారావు, సముద్రాల శ్రీనివాస్‌, సామ్రాట్‌, సల్మాన్‌  

పుట్ట గొడుగుల తయారీ కేంద్రం ప్రారంభం

కమాన్‌పూర్‌: పెంచికల్‌పేటలో ఎన్టీపీసీ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ కేంద్రంలో ఆ గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్ట గొడుగుల పెంపకం కేంద్రాన్ని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధూకర్‌ మాట్లాడారు. టీ సెర్ప్‌, డీఆర్‌డీవో వారి సహకారంతో గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ఆగ్రోమాలిన్‌ సంస్థ వారి బైబ్యాక్‌ ఒప్పందంతో పుట్ట గొడుగుల పెంపకకేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పెంచికల్‌పేట గ్రామంలో సెగ్రిగేషన్‌ షెడ్డును పుట్ట మధూకర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనగంటి భాస్కర్‌రావు, వైస్‌ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్‌యాదవ్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇంతియాజ్‌, సర్పంచ్‌ కొండ వెంకటేశ్‌, ఎంపీటీసీ గొడిసెల ఉమ, డీఎల్‌పీవో రాంబాబు, ఎంపీడీవో వెంకటేశ్‌ జాదవ్‌, ఎంపీవో వాజిద్‌, జడ్పీ ఓఎస్డీ సయ్యద్‌ సలీం అహ్మద్‌, డీపీఎం, రవి, ఏపీఎం శైలజశాంతి, ప్రజాప్రతినిధులు, నాయకులు బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, కోలేటి చంద్రశేఖర్‌, బోనాల వెంకటస్వామి, పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డితోపాటు గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.  

పరామర్శ

మంథని రూరల్‌: అడవిసోమన్‌పల్లి గ్రామానికి చెందిన పాగె లింగయ్య, జాడి మల్లు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారిలో మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా పాగె లింగయ్య కుటుంబానికి రూ. 5వేల ఆర్థికసాయం అందజేయడంతోపాటు రైతు బీమా వెంటనే మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా జాడి మల్లు కుటుంబానికి రూ.2వేలను ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా నాయకుడు జక్కు రాకేశ్‌, ఎంపీపీ కొండా శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌తోపాటు పలువురు  పాల్గొన్నారు.