సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Sep 21, 2020 , 02:40:07

ఆలయ అభివృద్ధికి ఆర్థికసాయం

ఆలయ అభివృద్ధికి ఆర్థికసాయం

ఎలిగేడు: నర్సాపూర్‌ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శివరామాంజనేయ ఆలయానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, నల్లా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నల్లా మనోహర్‌రెడ్డి రూ.2.30 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఆదివారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల విన్నపం మేరకు ధ్వజస్తంభం నిర్మాణం దాని  ప్రతిష్టాపనకు అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పారు.  అనంతరం గ్రామస్తులు నల్లా మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సర్పంచ్‌ తంగెళ్ల స్వప్న, కుమార్‌యాదవ్‌, ఎలిగేడు విండో చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ వర్మని కిష్టయ్య, ఆలయ చైర్మన్‌ కాట నారాయణగౌడ్‌, కార్యదర్శి చింతిరెడ్డి రాజిరెడ్డి, పూజారి గజవెల్లి రామలింగం, ఎం రాజు, పొరండ్ల లక్ష్మి, రాజేశం, వెంకటేశం పాల్గొన్నారు.