బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Sep 21, 2020 , 02:36:30

గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి

గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి

రామగిరి: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నాగేపల్లి గ్రామంలో వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకుసాగుతున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొండవేన ఓదెలు, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, ఏఎంసీ చైర్మన్‌  పూదరి సత్యనారాయణ గౌడ్‌, జడ్పీటీసీ మ్యాదరవేన శారద, రైతు బంధు కమిటీ మండలాధ్యక్షుడు మ్యాదరవేన కుమార్‌ యాదవ్‌, వైస్‌ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, ఎంపీడీవో విజయకుమార్‌, ఏఎంసీ డైరెక్టర్లు ఆసం తిరుపతి, బేతు కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకేసి రవీందర్‌, నాయకులు ఆరెల్లి కొమురయ్యగౌడ్‌, కాపురబోయిన భాస్కర్‌, బుర్ర శంకర్‌ గౌడ్‌, గాజుల ప్రసాద్‌, గారబోయిన నరేశ్‌ యాదవ్‌, ఎంపీవో జగదీశ్వర్‌రావు, ఈజీఎస్‌ ఏపీవో రమేశ్‌బాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

పరామర్శ

ముత్తారం: పొలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కోర్టు కానిస్టేబుల్‌ సంజీవ్‌ను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ హైదరాబాద్‌లో పరామర్శించారు. సంజీవ్‌కు  కరోనా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు జడ్పీ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పుట్ట మధూకర్‌ శనివారం రాత్రి పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.  ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్‌ఐ నరసింహారావుతో పాటు జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత, అశోక్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్‌, రైతు బంధు మండలాధ్యక్షుడు అత్తె చంద్రమౌళి తదితరులున్నారు.