బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Sep 21, 2020 , 02:14:30

పల్లెల అభివృద్ధే ధ్యేయం

పల్లెల అభివృద్ధే ధ్యేయం

ఫర్టిలైజర్‌సిటీ/జ్యోతినగర్‌/ అంతర్గాం: పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్వతీ బరాజ్‌ బ్యాక్‌వాటర్‌లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి 2లక్షల చేప పిల్లలు వదిలారు. అనంతరం అం తర్గాం మండలం కుందనపల్లిలో గొర్రెలు, మేకల మార్కెట్‌ యార్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. నీరే మనుషులకు జీవనాధారమని భావించి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కులవృత్తులను కాపాడే లక్ష్యంతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. దేశం లో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గొర్రెల పంపిణీ ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే రెండో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించి డీడీలు చెల్లించిన చివరి లబ్ధిదారుడి పంపిణీ చేస్తామని హామీఇచ్చారు. అక్టోబర్‌ 15 నుంచి ప్రతి గొర్రెకూ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. డెయిరీ సభ్యులకు రూ.4 ప్రోత్సాహకంగా అందిస్తున్నామని చెప్పారు. గొర్రెలు, మేకల మార్కెట్‌ యార్డులకు నాలుగున్నర ఎకరాల స్థలం కేటాయించాలని తన దృష్టికి శాసన సభ్యులు తీసుకువచ్చిన వెంటనే సీఎంతో చర్చించి రూ.25లక్షలు మంజూరు చేయించానని గుర్తు చేశారు, చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకానికి మత్స్యకారులకు హక్కులు కల్పించామని చెప్పారు. గత పాలకులు ముదిరాజ్‌లు, బెస్తవారిని పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.900 కోట్లతో టీవీఎస్‌ వాహనాలను, వ్యాన్లు, వలలు, ఇతర పరికరాలు మత్స్యకార్మికులకు పంపిణీ చేసిందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనువైన భూమి కేటాయిస్తే చేపల మార్కెట్‌ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సర్కారు చేపలతోపాటు రూ.10 కోట్లు వెచ్చించి రొయ్యలను సైతం ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు.  

గ్రామాల్లో ఉపాధి పెంపు: మంత్రి ఈశ్వర్‌

కులవృత్తుల పునరుద్ధరణ ద్వారా గ్రామీణులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.3వేల కోట్లు వెచ్చించి గొర్రెలు పంపిణీ చేశారనీ మత్స్యకారులకు  పరికరాలు అందించారన్నారు. మత్స్యకారులు ఇతర రాష్ర్టాలకు చేపలను ఎగుమతి చేసేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రాజెక్టులతో చెరువుల్లో ఏడాది పొడుగునా నీరు ఉంటుందన్నారు.  

కోల్ట్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే చందర్‌

గోదావరి దశదిశను మార్చిన కేసీఆర్‌ మత్స్య సంపదతోపాటు రొయ్యల ఉత్పత్తిని పెంపొందించే విధంగా కృషి చేశారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హర్షం వ్యక్తం చేశారు. బెస్త, ముదిరాజ్‌, కులస్థులకు ఉచితంగా చేపలు పంపిణీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పారిశ్రామిక ప్రాం తంలో చేపల మార్కెట్‌, కోల్ట్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఎగ్లాస్‌పూర్‌, కుక్కలగూడురు, గుంటూరుపల్లి, అల్లూరు, మల్కాపూర్‌లో పశువుల దవాఖాన సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాల విజ్ఞప్తి చేశారు. 

మత్స్య కళాశాల ఏర్పాటు చేయాలి: మధూకర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుందిళ్ల బరాజ్‌లోకి నీరు అందుబాటులో ఉంటుందనీ, పరిసర ప్రాంతంలో మత్స్య కళాశాల, అధికారులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  స్పందించిన మంత్రి   సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, అధికారులకు సంపూర్ణ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ కుల సంఘం నాయకులు ప్రశాంత్‌ ఆధ్వర్యంలో మంత్రులు తలసాని, ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యే చందర్‌ను సన్మానించారు. అంతకుముందు మంత్రులు అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, ఎంపీపీ దుర్గం విజయ, అనసూయ, వైస్‌ ఎంపీపీ లక్ష్మీ మహేందర్‌రెడ్డి, మత్స్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్లు రాంచందర్‌, జాయింట్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, డీఎఫ్‌వో మల్లేశం, జడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, ఆముల నారాయణ, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, వేగోళపు రమాదేవి శ్రీనివాస్‌, మం చికట్ల దయాకర్‌, ఇంజపురి పులెందర్‌, అడ్డాల గట్టయ్య, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్‌చార్జి, డీఆర్వో నరసింహామూర్తి, పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌, అంతర్గాం తహసీల్దార్‌ బండి ప్రకాశ్‌,  జిల్లా యాదవ, కురుమ సంఘం అధ్యక్షులు తిరుపతి, మల్లేశం, జిల్లా పశు సంవర్ధక, మత్స్యశాఖ అధికారు లు రాజన్న, మల్లేశం, డీసీపీ రవీందర్‌, గోదావరిఖని టూ టౌన్‌ సీఐలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, వన్‌ టౌన్‌, రామగుండం సీఐలు పర్స రమేశ్‌, కరుణాకర్‌ ఉన్నారు.