ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Sep 20, 2020 , 03:01:45

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

  •  మంత్రి ఈటల రాజేందర్‌ n ప్రమాద బీమా చెక్కుల పంపిణీ

వీణవంక: కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. రెడ్డిపల్లికి చెందిన ఒడ్డెపెల్లి అఖిల్‌, చల్లూరు కు చెందిన గుంపుల శ్రీధర్‌ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యు లు ఒడ్డెపెల్లి ఒదయ్య, గుంపుల కేతమ్మకు చెరో రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం అందజేశారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ చనిపోతే టీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున రూ.2లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇందులో పార్టీ మండలాధ్యక్షుడు మారముల్ల కొమురయ్య, నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాదవరెడ్డి, రాయిశెట్టి శ్రీనివాస్‌, వాల బాలకిషన్‌రావు, గొర్రె రాజమౌళి, మోటం వెంకటేశ్‌, కోటేశ్వర్‌, సర్పంచులు పోతుల నర్సయ్య, పర్లపెల్లి రమేశ్‌ ఉన్నారు.

తాజావార్తలు