బుధవారం 28 అక్టోబర్ 2020
Peddapalli - Sep 20, 2020 , 03:00:31

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం

  • n జల ప్రదాత సీఎం కేసీఆర్‌
  • n ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గోదావరి నది వద్ద రూ.5లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ జెట్‌ను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించి, మాట్లాడారు. తూర్పున ప్రవహించే గోదావరి నదిని పడమర వైపునకు మళ్లించి తెలంగాణ దశదిశా మార్చి గోదావరి నదిని నిండుకుండలా మార్చిన జల ప్రదాత సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. నిండుకుండలా మారిన గోదావరి నదిపై మొదటిసారిగా పడవల పోటీలను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. త్వరలోనే గోదావరిఖని గోదావరి తీరం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని వివరించారు. అందులో భాగంగా హరిత గెస్ట్‌హౌస్‌, పడవలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరామని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే గోదావరి తీర ప్రాంతానికి పడవలు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా గోదావరి నదిలో బోట్‌ డ్రైవింగ్‌, లైఫ్‌గార్డ్‌, రెస్క్యూ ఆపరేషన్‌లో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో మేయర్‌ డా.బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, కుమ్మరి శ్రీనివాస్‌, సాగంటి శంకర్‌, అడ్డాల గట్టయ్య, భాస్కర్‌, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, రఫీక్‌, జాహిద్‌ పాషా, శంకర్‌ గౌడ్‌, రాజేశ్‌, అచ్చవేణు, నూతి తిరుపతి, దేవరాజ్‌, గోలివాడ ప్రసన్నకుమార్‌ తదితరులున్నారు.


logo