గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Sep 19, 2020 , 02:20:49

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేయండి

రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేయండి

  •  సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కోరుకంటి వినతి

గోదావరిఖని: రామగుండంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సీఎంను కోరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను శుక్రవాం కలిశారు. రామగుండం ప్రాంతంలోని భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానికంగా కార్యాలయం లేకపోవడంతో 30 కిలోమీటర్ల దూరంలోని పెద్దపల్లికి వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. ఫలితంగా దూరభారంతోపాటు సమ యం వృథా అవుతున్నదని, ఈ క్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చందర్‌ తెలిపారు.