ఆదివారం 01 నవంబర్ 2020
Peddapalli - Sep 17, 2020 , 02:52:32

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

  • n పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • n మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన

ఓదెల: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లిలో డీఎంఎఫ్‌టీ నిధులు 8.23లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ పేదలతోపాటు అన్ని వర్గాల క్షేమమే లక్ష్యంగా కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి ద్వారా సాయం అందించడం సీఎం గొప్ప మనస్సుకు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, సర్పంచ్‌ పోతుగంటి రమ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, వైస్‌ ఎంపీపీ పల్లె కుమార్‌గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ పోతుగంటి రాజుగౌడ్‌, పీఆర్‌ ఏఈ సమ్మిరెడ్డి, ఏపీఎం లతామంగేశ్వరి, సర్పంచులు ఆళ్ల రాజిరెడ్డి, గుండేటి మధు, కర్క మల్లారెడ్డి, ఎంపీటీసీ జీల తిరుపతి, ఉప సర్పంచ్‌ రమేశ్‌, నాయకులు ఆకుల మహేందర్‌, గోపు నారాయణరెడ్డి, ఆరెల్లి మొండయ్యగౌడ్‌, మద్దెల నర్సయ్య, మ్యాడగోని శ్రీకాంత్‌, బోడకుంట చినస్వామి పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.