మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Peddapalli - Sep 16, 2020 , 03:09:55

సంస్థాగత నిర్మాణానికే కమిటీలు

సంస్థాగత నిర్మాణానికే కమిటీలు

  • n రామగుండం ఎమ్మెల్యే   కోరుకంటి చందర్‌

గోదావరిఖని: టీఆర్‌ఎస్‌ పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా శ్రేణులు పని చేయాలని, పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో 10 పట్టణ కమిటీలు నియమించామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. మంగళవారం పట్టణ, డివిజన్‌ కమిటీల ఎంపికకు ఇన్‌చార్జిలను ఎమ్మెల్యే ప్రకటించారు. 1,20,21,22 డివిజన్ల రామగుండం పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా పీటీ స్వామి, 2,3,4,5,23,24 డివిజన్లకు ఎన్టీపీసీ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా పాతపెల్లి ఎల్లయ్య, 6,7,8, 9, 27 డివిజన్లకు గంగానగర్‌ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా దీటి బాలరాజు, 10, 28, 29, 30, 41 డివిజన్లకు హనుమాన్‌ నగర్‌ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా తానిపర్తి గోపాల్‌ రావు, 11, 12, 13, 33, 34 డివిజన్లకు ఫైవింక్లయిన్‌ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా తోడేటి శంకర్‌ గౌడ్‌, 35, 36, 37, 45, 46 డివిజన్లకు తిలక్‌నగర్‌ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా రామస్వామి, 31, 32, 42, 43, 44 డివిజన్లకు ఎల్బీనగర్‌ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా మూల విజయారెడ్డి, 25, 26, 40, 49, 50 డివిజన్లకు లక్ష్మీనగర్‌ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా అచ్చ వేణు, 14, 38, 39, 47, 48 డివిజన్లకు గౌతమినగర్‌ పట్టణ కమిటీకి నారాయణ మారుతి, 15, 16, 17, 18, 19 డివిజన్లకు 8వ కాలనీ పట్టణ కమిటీ ఇన్‌చార్జిగా మొగిలిని నియమించారు. 


logo