బుధవారం 30 సెప్టెంబర్ 2020
Peddapalli - Sep 16, 2020 , 03:09:56

పెద్దపల్లిని సుందరంగా తీర్చిదిద్దాలి

పెద్దపల్లిని సుందరంగా తీర్చిదిద్దాలి

  • n ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
  • n ఘనంగా ఇంజినీర్స్‌ దినోత్సవం

పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఇంజినీర్స్‌ డే సందర్భంగా పెద్దపల్లి ఎంబీ గార్డెన్‌లో పెద్దపల్లి కన్సల్టెంట్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఎమ్మెల్యే పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లిలో ఇష్టానుషారం ఇండ్లు నిర్మించుకోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పెరిగిన జనాభా ఆధారంగా సివిల్‌ ఇంజినీర్లు అంకితభావంతో సహజసిద్ధమైన వాతావరణం ఉండేలా ఇంటి ప్లాను రూపొందించాలని సూచించారు. పట్టణాభివృద్ధికి దోహదపడాలని కోరారు. అనంతరం పలువురి ఇంజినీర్లను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌,కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్‌, భిక్షపతి, చంద్రశేఖర్‌, ఎలక్ట్రికల్‌ ఏఈ వెంకట్‌, సివిల్‌ అసోసియేషన్‌ సభ్యులు విజేందర్‌, రాజు, జావిద్‌, అస్రఫ్‌, అరుణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, సాయికృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు మోబిన్‌, పెంచాల శ్రీధర్‌, కొలిపాక చిరంజీవి, బెక్కం ప్రశాంత్‌, సాబీర్‌ఖాన్‌ పాల్గొన్నారు.

యువ ఇంజినీర్లకు మార్గదర్శి..

కోల్‌సిటీ: నేటితరం యువ ఇంజినీర్లకు మార్గదర్శి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని రామగుండం నగర పాలక సంస్థ మేయర్‌ డా.బంగి అనిల్‌ కుమార్‌ కొనియాడారు. ఇంజినీర్స్‌ దినోత్సవం సందర్భంగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌తో కలిసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

 సన్మానం 

పెద్దపల్లి జంక్షన్‌: నేషనల్‌ ఇంజినీర్స్‌ డే సందర్భంగా పలు విభాగాల ఇంజినీర్లను పెద్దపల్లి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో డీఈ నర్సింహాచారి, ఆర్‌అండ్‌బీ ఈఈ రవీందర్‌ను శాలువాలతో సన్మానిం చారు. అనంతరం మొక్కలు పంపిణీ చేసి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ పెద్దపల్లి ఎలైట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌కుమార్‌, కార్యదర్శి చంద్రగిరి వంశీ రాజు, కోశాధికారి సంపత్‌రావు, రవీందర్‌, అనీల్‌, జయపాల్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, రూరల్‌ ఏఈ వెంకట్‌, ఆనంద్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

రామగిరి: ఆర్జీ-3, ఏపీఏ జీఎం కార్యాలయంలో జీఎం కే సూర్యనారాయణ, ఏపీఏ జీఎం వెంకటేశ్వరరావు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం సూర్యనారాయణ, రాజేశ్వరి, ఏరియా ఇంజినీర్‌ రామలింగం, రాజశేఖర్‌ రెడ్డి, డీవైజీఎం చంద్రశేఖర్‌, విలాస్‌ శ్రీనివాస్‌, సుధాకర్‌, అనిల్‌ కుమార్‌, లక్ష్మీనారాయణ, కిశోర్‌ తదితరులున్నారు. 

యైటింక్లయిన్‌ కాలనీ: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆర్జీ-2లో జీఎం ఎం.సురేశ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం సాంబయ్య, ఏరియా ఇంజినీర్‌ రాధాకృష్ణ రావు, ఓసీపీ-3 పీవో నరసింహారావు, ఏజీఎం పద్మరావు, డీజీఎం ఎర్రన్న, రామకృష్ణ, మురళీకృష్ణ, ప్రదీప్‌కుమార్‌, రమేశ్‌బాబు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ రమేశ్‌ బాబు, గ్రూపు ఇంజినీర్‌ పైడీశ్వర్‌, డిప్యూటీ మేనేజర్‌ వెంకట మోహన్‌, సురేశ్‌బాబు, శ్రీనివాస్‌, పీవీ రమణ తదితరులున్నారు.


logo