సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Sep 15, 2020 , 02:59:35

రైతులు అప్రమత్తంగా ఉండాలి

రైతులు అప్రమత్తంగా ఉండాలి

  • nఅడవిలోకి వెళ్లే వారు మరింత జాగ్రత్త 
  • nపెద్దపల్లి జిల్లా అటవీ శాఖ అధికారి    రవిప్రసాద్‌ యాదవ్‌

పెద్దపల్లిరూరల్‌ :  పెద్దపల్లి మండలం రంగాపూర్‌, రాఘవాపూర్‌ శివారు ప్రాంతాల్లోని గుట్టల ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు.  పులి కదలికల సమాచారం అందుకున్న రవిప్రసాద్‌ సిబ్బందితో కలిసి సోమవారం రంగాపూర్‌, రాఘవాపూర్‌ గుట్ట ప్రాంతాలను పరిశీలించారు. రంగాపూర్‌ శివారులోని గుట్టకింద ఉన్న  మామిడితోటలో పులి అడుగులను పరిశీలించి ఈ ప్రాంతంలోనే పెద్దపులి సంచరిస్తుందని  రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పశువులు, గొర్రెల కాపపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెద్దపులి సబ్బితం గట్టుసింగారం గుట్టల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తుందని చెప్పా రు. ఎఫ్‌ఆర్వో నాగయ్య, సెక్షన్‌ ఆఫీసర్‌ ఎండీ అమీనొద్దీన్‌, బీట్‌ ఆఫీసర్‌ ఆనందరావు, వాచర్‌ సురేందర్‌ ఉన్నారు.