మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Sep 14, 2020 , 03:21:15

మౌలిక వసతులు కల్పిస్తాం

మౌలిక వసతులు కల్పిస్తాం

సుల్తానాబాద్‌రూరల్‌ : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని భూపతిపూర్‌, ఐతరాజ్‌పల్లి గ్రామాల్లో ఆదివారం మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన చేశారు. భూపతిపూర్‌లో సీసీ రోడ్డు, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ వసతులు ఉండేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సర్పంచులు కవ్వంపల్లి జమున, దేవమ్మ, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ అనంతరెడ్డి, ఎంపీటీసీలు పులి అనూష, విజయ,  సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, నాయకులు పాల రామారావు, పోచమల్లు, కవ్వంపల్లి తిరుపతి,  వెంకన్న, శ్రీనివాస్‌గౌడ్‌, బాపురావు,  రమణారెడ్డి, మహేందర్‌, రమణాచారి, స్వామి, శ్రీనివాస్‌, చిన్నయ్య, ఉప సర్పంచులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. 

 ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు 

 కాల్వశ్రీరాంపూర్‌ : అసెంబ్లీలో నూతన రెవెన్యూ బిల్లు ఆమోదం పొందడంతో పాటు , పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛ భారత్‌ అవార్డు వచ్చిన సందర్భంగా కాల్వశ్రీరాంపూర్‌ మండల టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ కొనుకటి మల్లారెడ్డి, ఆర్బీఎస్‌ కన్వీనర్‌ దేవయ్య, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఇబ్రహీం, నాయకులు రాజు, వెంకన్న, రాంచంద్రం, రవీందర్‌, నవీన్‌, సదానందం, ఖదీర్‌ తదితరులు ఉన్నారు.