శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Sep 12, 2020 , 03:09:42

స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

  • n జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  • n కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుతో కలిసి రైతులతో సమావేశం

మంథని టౌన్‌: యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని పోచమ్మవాడలోని కరీంనగర్‌ డెయిరీ మిల్క్‌ బల్క్‌ యూనిట్‌లో డెయిరీ చైర్మన్‌ చలిమెడ రాజేశ్వర్‌రావుతో కలిసి పాడి రైతులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మధూకర్‌ మాట్లాడారు. కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ మాట్లాడుతూ.. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పాడి వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రైతులు పాలను కరీంనగర్‌ డెయిరీలో పోస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మాట్లాడారు. పాడి రైతులందరూ కరీంనగర్‌ డెయిరీ మిల్క్‌బల్క్‌ యూనిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు వీకే. రవి, గర్రెపల్లి సత్యనారాయణ, నాయకులు బత్తుల సత్యనారాయణ, కుంట శ్రీనివాస్‌, ఎంఎస్‌.రెడ్డి, గొబ్బూరి వంశీ, యాకుబ్‌ పాల్గొన్నారు. 

మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతాం 

మంథని మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తెలిపారు.పట్టణంలోని 13వ వార్డులో సీసీ రోడ్డు పనులను మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చెలిమెడ రాజేశ్వర్‌రావుతో కలిసి జడ్పీ చైర్మన్‌ శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కరీంనగర్‌ డెయిరీ పాయింట్‌ను కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ చెలిమెడ రాజేశ్వర్‌రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌తో కలిసి మధూకర్‌ ప్రారంభించారు. అనంతరం రాజేశ్వర్‌రావును జడ్పీ చైర్మన్‌ శాలువాతో సన్మానించారు.