మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Sep 11, 2020 , 03:04:56

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ధర్మారం: వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. పటాకల కాల్చారు. బొట్లవనపర్తిలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, మల్లాపూర్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో బొట్లవనపర్తి, మల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ గ్రామశాఖల అధ్యక్షులు కల్లెపల్లి లింగయ్య, గుమ్మడి శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ మంద శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ గంధం రవీందర్‌, ఆర్‌బీఎస్‌ గ్రామ కోఆర్డినేటర్‌ రామ్మూర్తి, నాయకులు నారాయణ, ముదుగంటి శ్రీనివాస్‌ రెడ్డి, సాదె రవీందర్‌, నిమ్మ మల్లయ్య, కొడిపెల్లి లక్ష్మీనారాయణ, మోర కొమురయ్య, కోండ్ర రాజేందర్‌, దారవేని ఓదెలు, ఆకారి రమేశ్‌, రాజయ్య, మల్లేశం, వాలుక నరేశ్‌, కనుకయ్యతో మల్లాపూర్‌ జీపీ వార్డు సభ్యులు గణేశ్‌, నిమ్మ నర్సయ్య పాల్గొన్నారు.

గోదావరిఖని : రామగుండం 13వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు రాకం లత దామోదర్‌ మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులపై అసెంబ్లీలో చర్చించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బొజ్జ శ్రీను, రాజేందర్‌, అనుమాల శంకరయ్య, మల్లక్క, రాజయ్య, నర్సయ్య, చంద్రగిరి దానయ్య, గాజుల రమేశ్‌, కనుకయ్య, మల్లయ్య, శంకర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.   

పాలకుర్తి: సీఎం కేసీఆర్‌, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చిత్రపటాలకు ముంజంపల్లి, మారేడుపల్లిల్లో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి, సర్పంచ్‌ గంధం లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు పందిళ్ల రాజిరెడ్డి, కొమ్ము సంజీవ్‌యాదవ్‌, సప్ప జలంధర్‌, బుచ్చిలింగయ్య, గంగయ్య, కనుకయ్య, మొగిలి, కృష్ణ, మహిపాల్‌, చిలుకయ్య, మల్లయ్య తదితరులున్నారు.

జూలపల్లి : మండల కేంద్రంలోని పాత బస్టాండు ప్రాంతంలో ఆర్‌బీఎస్‌ ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు. ఇక్కడ ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ నాడెం మల్లారెడ్డి, నాయకులు పాటకుల అనిల్‌, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, తాటిపెల్లి రాయలింగం, లాల్‌మహ్మద్‌, మెండె మల్లేశం, గుమ్మడి రాజిరెడ్డి, గడ్డం మోహన్‌రెడ్డి, ఐల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం మసీద్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు అన్వేష్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు రాము చరణ్‌, షానవాజ్‌, అఖిల్‌, మహేశ్‌, అజయ్‌, లక్కీ, యేసు, పవన్‌ తదితరులు ఉన్నారు.