బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Sep 08, 2020 , 01:31:13

కొనసాగిన ప్రత్యేక బృందం పర్యటన

కొనసాగిన ప్రత్యేక బృందం పర్యటన

  • lహుజూరాబాద్‌ పట్టణంతో పాటు విలీన    గ్రామాల్లో అభివృద్ధి పనుల గుర్తింపు

హుజూరాబాద్‌టౌన్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచన మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశాలతో ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ప్రత్యేక బృందం రెండో రోజూ సోమవారం హుజూరాబాద్‌ పట్టణంతో పాటు పురపాలక సంఘం పరిధిలోని దమ్మక్కపేట, ఇప్పల్‌నర్సింగాపూర్‌, కొత్తపల్లిలో విస్తృతంగా పర్యటించింది. ఈ సందర్భంగా బృం దం సభ్యులు మాట్లాడుతూ రెండు రోజుల పర్యటనలో 24 అభివృద్ధి పనులను గుర్తించామని, మంగళవారంతో తమ మూడు రోజుల పట్టణ పరిశీలన పూర్తవుతుందని చెప్పారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం, మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కంప్రెహెన్సివ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. వీటిని మున్సిపల్‌ ఉన్నతాధికారుల ద్వారా మంత్రి ఈటల రాజేందర్‌కు అందజేస్తామని బృందం ప్రతినిధి, వరంగల్‌ ఆర్డీఎంఏ మసూద్‌ అహ్మద్‌ తెలిపారు. పర్యటనలో బృందం సభ్యులు వరంగల్‌ పీహెచ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, వరంగల్‌ ఆర్డీటీపీ రవీందర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ డీఎఫ్‌వో లీలాప్రకాశ్‌, ఈఈ ఎస్‌ నర్సింహారెడ్డి, హైదరాబాద్‌ ఎన్‌ఐయూఎం నాలెడ్జ్‌ మేనేజర్‌ ఐ ప్రవీణ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, కమిషనర్‌ ఈ జోన, ఏఈ చంద్రమౌళి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌, టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ అశ్వినిగాంధీ, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.