సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Sep 06, 2020 , 02:35:26

ఇండస్ట్రియల్‌ పార్కు పనులు ప్రారంభించండి

ఇండస్ట్రియల్‌ పార్కు పనులు ప్రారంభించండి

  • మంత్రి కేటీఆర్‌కు రామగుండం ఎమ్మెల్యే చందర్‌ వినతి

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఏర్పాటు చేయనున్న ఐటీ, ఇం డస్ట్రియల్‌ పార్కు పనులను త్వరగా ప్రా రంభించేందుకు రాష్ట్ర భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ ద్వారా అనుమతులకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. పా ర్కు పురోగతిపై చర్చించారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. పార్కు నిర్మాణం కోసం జిల్లా క లెక్టర్‌ ద్వారా ప్రతిపాదనలు పంపించామని, వాటికి సీసీఏ క్లియరెన్స్‌ కోసం సంబంధిత అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరా రు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించి రామగుండం అభివృద్ధికి తప్పకుండా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని చందర్‌ తెలిపారు. అలాగే పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మె ల్యే చందర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.