ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Sep 04, 2020 , 02:08:15

వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలి

 వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలి

  • పెద్దపల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతి హోళికేరి

కాల్వశ్రీరాంపూర్‌ : రైతు వేదిక నిర్మాణ పనులను పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతి హోళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కాల్వశ్రీరాంపూర్‌, పెగడపల్లి, కిష్టంపేట గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను గురువారం ఆమె పరిశీలించారు. రూ. 22లక్షల వ్యయంతో ప్రతి క్లస్టర్‌లో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేదికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మండలంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్లస్టర్ల వారీగా నిర్మాణ వివరాలు ప్రతి రోజూ అందించాలని సూచించారు. ఈనెల 20 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, కిష్టంపేట, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ నిర్మిస్తున్న రైతు వేదికల పరిసరాలు చూసి మార్పులు సూచించారు. డీపీవో సుదర్శన్‌, డీఏవో తిరుమల్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ సునిత, ఏవో నాగార్జున ఏపీవో మంజుల, సర్పంచులు అరెల్లి సుజాత, ఆడెపు శ్రీదేవి, ఏఈ మల్లేశం, ఆర్‌ఐ లు నవాజొద్దీన్‌, సుమలత, నాయకుడు రాజు ఉన్నారు. 

వేగవంతం చేయండి..

సుల్తానాబాద్‌రూరల్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. మండలంలోని అల్లీపూర్‌, సుద్దాల గ్రామాలను గురువారం ఆమె సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. ఇక్కడ ఎంపీడీవో గంగుల సంతోష్‌కుమార్‌, జడ్పీటీసీ మినుపాల స్వరూపారాణి, సర్పంచులు వసంత, అంజలి ఉన్నారు.