బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Sep 04, 2020 , 02:08:17

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

  • n  కరోనా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి
  •  n  కలెక్టర్‌ శశాంక
  • n  ఎంపీడీవో పనితీరుపై అసంతృప్తి

మానకొండూర్‌ రూరల్‌: పల్లెల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలోని లక్ష్మీపూర్‌, పచ్చునూర్‌ గ్రామాల్లో గురువారం కలెక్టర్‌ పర్యటించారు. ప్రగతిలో ఉన్న రైతు వేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీపూర్‌ పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు, చికిత్స వివరాలపై డాక్టర్‌ స్వాతిని అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ వ్యాప్తిపై అవగాహన కల్పించాలని సూచించారు. పచ్చునూర్‌లోని వైకుంఠధామం, డంప్‌యార్డ్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయనీ ఎంపీడీవో భాస్కర్‌ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ సులోచన, వైస్‌ ఎంపీపీ గోపు మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్‌, తహసీల్దార్‌ రాజ య్య, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్సీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచులు తుమ్మల అర్చన, నర్మెట వసంత, ఆర్‌ఐలు సోనియా, రాఘవేందర్‌, ఆర్బీఎస్‌ కోఆర్డినేటర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.