ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Sep 03, 2020 , 01:46:01

‘మాతంగి’కి కన్నీటి వీడ్కోలు

‘మాతంగి’కి కన్నీటి వీడ్కోలు

  • n అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 
  • n నివాళులర్పించిన మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కోరుకంటి, ప్రముఖులు

గోదావరిఖని: అనారోగ్యంతో మృతి చెందిన  మా జీ మంత్రి మాతంగి నర్సయ్యకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియ లు నిర్వహించారు.  గోదావరిఖని శివారులోని గో దావరి నదీ తీరంలో దహన సంస్కారాలు చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్‌, రామగుండం మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు. పార్థివ దే హానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాతంగి నర్సయ్యతో తనది 40 ఏండ్ల అనుబంధమని చెప్పారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఉమ్మడి జిల్లాకు సుపరిచితుడన్నారు. ఆయ న మరణం తీరని లోటన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక ప్రజాసమస్యలు పరిష్కరించారని చెప్పారు.   పెద్ద వాడిగా అందరికి సూచనలు చేసే మాతంగి నర్సయ్య లేని లోటు తీర్చలేనిదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.  ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.   మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డాల రామస్వామితో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ,   జీవన్‌రెడ్డి మాతంగి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు.  అంత్యక్రియల్లో   అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఈర్ల కొమురయ్య, బొంతల రాజేశ్‌, పెద్దెల్లి ప్రకా శ్‌, ఆస్రాప్‌ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మె ల్యే బీజేపీ నాయకుడు సోమారపు సత్యనారాయ ణ నివాళులర్పించారు. మాతంగి నర్సయ్య మృతి తీరని లోటని అతని మిత్రుడు తెలంగాణ రాష్ట్ర ఆ ర్థిక సంఘం చైర్మన్‌ జీ రాజేశంగౌడ్‌  పేర్కొన్నారు.