శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Sep 03, 2020 , 01:46:02

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌
  • సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌,  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌  చిత్రపటాలకు పాలాభిషేకం

 చొప్పదండి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నదని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. రామడుగు మండలంలో వరద కాలువకు నాలుగు చోట్ల తూముల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై టీఆర్‌ఎస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, సహకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆపత్కాలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. తూముల నిర్మాణంతో మండలంలోని గుమ్లాపూర్‌, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, కోనేరుపల్లి, మల్లన్నపల్లి, మంగళపల్లి గ్రామాల ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు తూముల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యేపై కాంగ్రెస్‌ నాయకుడు మేడిపల్లి సత్యం ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్‌ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, కాశిపాక గంగస్వామి, కరీం, గుడిపాటి వెంకటరమణారెడ్డి, బచ్చు నర్సయ్య, మంద అంజయ్య, అమరగొండ తిరుపతి, గ్యాజంగి రాములు, గండు రామ్మూర్తి, మావురం మహేశ్‌, చోటు, కడారి వెంకటేశ్‌, భక్తు కుమార్‌, నరేశ్‌, మంచికట్ల విఠల్‌  పాల్గొన్నారు.