గురువారం 03 డిసెంబర్ 2020
Peddapalli - Sep 02, 2020 , 02:48:25

తాగునీటి కష్టాలు తొలగించేందుకే ‘మిషన్‌ భగీరథ’

తాగునీటి కష్టాలు తొలగించేందుకే ‘మిషన్‌ భగీరథ’

  • lరామగుండం ఎమ్మెల్యే చందర్‌

జ్యోతినగర్‌(రామగుండం):తెలంగాణ రాష్ట్ర మహిళలకు తాగునీటి కష్టాలను తొలగించేందుకే మిషన్‌ భగీరథ పథకం తీసుకువచ్చామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నా రు. మంగళవారం రామగుండం పట్టణంలోని సీఎస్‌పీ కాలనీలోని మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ పనులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరు అందించడమే పథకం లక్ష్యమన్నారు. రామగుండం కార్పొరేషన్‌ ప్రాంతంలో 40వేల ఇళ్లకు సురక్షితమైన గోదావరి నీటిని అందించడం జరుగుతున్నదన్నారు. 24గంటల తాగు నీరు సరఫరాకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గతంలో వేసవి కాలంలో ఆడపడుచులు తాగునీటి కోసం బిందెలతో ట్యాంకులు, బోర్లవద్ద ఇబ్బందులు పడుతుండేవారని, తాగునీటి కోసం ధర్నాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తాగునీటి కష్టాలను రూపుమాపేందుకు మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ శుద్ధజలం అంస్తున్నామని తెలిపారు. రూ.90కోట్లతో 13 ట్యాంకుల నిర్మాణం చేపట్టిన ట్లు పేర్కొన్న ఎమ్మెల్యే  రూ.9 కోట్ల నిధులతో లీకే జీ పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.  ఇక్కడ రామగుండం నగరపాలక మేయర్‌ బంగి అనిల్‌కుమా ర్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కమిషనర్‌ ఉదదయ్‌కుమార్‌, కార్పొరేటర్లు సాగంటి శంకర్‌, దాతు శ్రీనివాస్‌, భాస్కర్‌, గట్టయ్య, నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్‌ గౌడ  రాజు, రవీందర్‌, శ్రావణ్‌ ఉన్నారు.