మంగళవారం 01 డిసెంబర్ 2020
Peddapalli - Sep 02, 2020 , 02:48:31

బండరాళ్లపై సజీవ చిత్రాలు

బండరాళ్లపై  సజీవ చిత్రాలు

  • lపత్తిపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకట్టుకుంటున్న రాక్‌ గార్డెన్‌
  • lరాళ్ల మధ్య ఆకర్షణీయంగా పూల మొక్కలు

ధర్మారం : పత్తిపాక జడ్పీ పాఠశాలలో రాక్‌ గార్డెన్‌ ఆకట్టుకుంటున్నది. ప్రధానోపాధ్యాయుడు పీఎం షేక్‌ కృషితో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నది. పాఠశాల హెచ్‌ఎం పీఎం షేక్‌, ఉపాధ్యాయులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాఠశాలను పార్కులా తీర్చిదిద్దారు. ఆవరణలోని గుట్ట బోరుపై ఉన్న బండరాళ్లను క్రమ పద్ధతిలో అమర్చారు. వీటి మధ్య పూల మొక్కలు నాటారు. రాళ్లపై రకరకాల వన్యప్రాణులు, పక్షులు, ఇతర ప్రాణుల చిత్రాలు వేయించారు. మయూరాలు, హంసలు, పాలపిట్ట , కుందేలు, సీతాకోక చిలుక, చేపలు, తిమింగళాలు, మొసలి, సొరచేప, బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఇక పెద్దపులి పెయింటింగ్‌ మాత్రం సజీవంగా ఉన్నదా? అన్నట్లు కనిపిస్తున్నది. ఒక బండపై చెట్టు బొమ్మ వేసి, దాని కింద ప్రశాంతంగా విద్యార్థి చదువుకుంటున్న చిత్రం చూపరులను ఆలోచింపజేస్తున్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన పెరటితోట, పూల గార్డెన్‌ను పలు పాఠశాలల నుంచి విద్యార్థులు చూసి వెళ్తున్నారు. పాఠశాలను అందంగా మలిచిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.