ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Sep 01, 2020 , 02:25:18

భవిష్యత్‌ తరాల కోసం హరితహారం

భవిష్యత్‌ తరాల కోసం హరితహారం

  • n పీవీతోనే తెలంగాణకు వన్నె
  • n ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని: భవిష్యత్‌తరాలకు స్వచ్ఛ వాతావారణం అందించేందుకు సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు శతజయంతి, ఆచార్య వినోభాబాయ్‌, గాంధీజీ జయంత్యోత్సవాల్లో భాగంగా గోదావరిఖని పట్టణంలోని గాయత్రి మై స్కూ ల్‌లో నేషనల్‌ యూత్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించగా, ఎమ్మెల్యే మొక్కలు నాటా రు. అనంతరం మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. భవిష్యత్‌తరాల కోసం దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి తెలంగాణ ప్రాంతానికి వన్నెతెచ్చిన బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు అని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటాలన్నారు. 

మృతుల కుటుంబాల పరామర్శ

గోదావరిఖని పట్టణంలోని 37వ డివిజన్‌కు చెందిన మల్లయ్య, 31వ డివిజన్‌లో జక్కుల మల్ల య్య ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు శ్రీనివాస్‌, బాలరాజ్‌ కుమార్‌, రమణారెడ్డి, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, అందె సదానందం, యాదవరాజు, సమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు, చెలకలపల్లి శ్రీనివాస్‌, బొడ్డు రవీందర్‌ ఉన్నారు.