గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Aug 30, 2020 , 02:24:49

దొరికినోళ్లకు దొరికినన్ని..

దొరికినోళ్లకు దొరికినన్ని..

  •  పార్వతీ గేట్ల వద్ద చేపల కోసం జాతర

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/మంథని రూరల్‌: మంథని మండలం సుందిళ్లలోని పార్వతీ బరాజ్‌ వద్ద మరోసారి చేపల జాతర కొనసాగింది. శనివారం తెల్లవారు జామున గేట్లు మూసివేయడంతో గత ఆది, సోమవారాల్లోని పరిస్థితే పునరావృతమైంది. చేపలు వచ్చినట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఉదయం 8 గంటల వరకే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 30కిపైగా గ్రామాల నుంచి చేపలు బాగా దొరుకుతున్నట్లు పట్టుకునేందుకు వేల సంఖ్యలో తరలివచ్చారు. చిన్నా పెద్దా తేడాలేకుండా కదిలారు. దొరికినోళ్లు దొరికినన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత సంచుల్లో వేసుకొని, ఇండ్లకు తీసుకువెళ్లారు. కొందరైతే బరువు ఎక్కువగా ఉండడంతో అక్కడే వదిలేశారు. మొత్తంగా ఆరు టన్నుల వరకు చేపలను పట్టుకొని వెళ్లినట్లు సమాచారం. జనం వేలాదిగా రావడం, ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు వచ్చి, క్లియర్‌ చేశారు.