శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Aug 28, 2020 , 02:34:37

రైతులకు ఉపయోగపడే మొక్కలు నాటాలి

రైతులకు ఉపయోగపడే మొక్కలు నాటాలి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పథకం కింద రైతులకు ఉపయోగపడే మొక్కలు నాటాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం  అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో ప్రతి మండలంలో 30 వేల టేకు, మలబార్‌, వేప మొక్కలు రైతుల పొలాల్లో నాటాలని మండల వ్యవసాయాధికారులు, ఎంపీడీవోలకు సూచించారు. పల్లె ప్రకృతి వనాలు, మంకీఫుడ్‌ కోర్టులలో ఎప్పటికప్పుడు స్ప్రే పద్ధతిని వినియోగించాలన్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వచ్చే నెల 15వ తేదీలోగా వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇందులో జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఏవో శ్రీధర్‌, ఎంపీడీవోలు, ఏవో, ఏఈవో, ఈజీఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.