శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Aug 27, 2020 , 02:38:49

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా

  • lరామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

ఫర్టిలైజర్‌సిటీ: పాలకుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ హామీ ఇచ్చారు.  శివారెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకోగా, మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో ఉంచారు. ఈ మేరకు ఎమ్మెల్యే దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.  శివారెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడి బిడ్డకు వైద్య సదుపాయం కల్పించి భరోసానిస్తామని తెలిపారు.