శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Aug 26, 2020 , 02:24:42

నేడే ‘బల్దియా’లో రెవెన్యూ మేళా

నేడే ‘బల్దియా’లో రెవెన్యూ మేళా

కోల్‌సిటీ: ఆస్తి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం తాజాగా కల్పించిన వెసలుబాటును సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి రాములు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బల్దియా కార్యాలయంలో మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో బిల్‌ కలెక్టర్లకు ఆయన మేళా నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో  ఆస్తి పన్ను బకాయి పడిన వారిని గుర్తించి ప్రభుత్వం కల్పించిన 90 శాతం వడ్డీ మాఫీపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వేతర భవనాల యజమానులు సెప్టెంబర్‌ 15కు కేవలం 10 శాతం అపరాధ వడ్డీ మాత్రమే చెల్లించేందుకు అవకాశం ఉన్నదని తెలిపారు. సోమ, బుధవారాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డబుల్‌ అసెస్‌మెంట్‌, ఆన్‌లైన్‌లో పేర్లు తప్పుగా రావడం, ఇల్లు పేరు మార్పిడి, ఇంటి నంబర్‌ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, ఇల్లు తీసేసిన తర్వాత కూడా ఇంటి పన్ను వస్తే మేళాలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. డోర్‌ నంబర్‌ కోసం అసెస్‌మెంట్‌ కాపీ, పేరు మార్పిడి కోసం మ్యుటేషన్‌ కాపీ, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌, ఇల్లు తీసినట్లయితే ఇంటి పన్ను రద్దు కోసం ఫొటో, చివరగా కట్టిన ఇంటి పన్ను రసీదు, ఇంటి పన్ను ఎక్కువగా వచ్చినట్లయితే అసెస్‌మెంట్‌ కాపీ, ఇంటి ఫొటో, సంబంధిత డాక్యుమెంట్‌, డబుల్‌ అసెస్‌మెంట్‌ వస్తే ఇంటి పర్మిషన్‌ లెటర్‌, అసెస్‌మెంట్‌ నంబర్‌, ఇంటి పన్ను రసీదు తదితర డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు పన్ను బకాయిలతో పాటు 10 శాతం అపరాధ వడ్డీని ఒకేమారు చెల్లించి 90 శాతం వడ్డీ మాఫీ పొంది నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సమావేశంలో ఆయా ఏరియాల బిల్‌ కలెక్టర్లు తదితరులు ఉన్నారు.