శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Aug 26, 2020 , 02:26:41

కేటీఆర్‌ నాయకత్వంలో ముందుకెళ్తాం

కేటీఆర్‌ నాయకత్వంలో ముందుకెళ్తాం

  • lమున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతాం lప్రభుత్వ పథకాలను  గడగడపకూ తీసుకెళ్తాం lపెద్దపల్లి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొలిపాక శ్రీనివాస్‌

పెద్దపల్లి టౌన్‌: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో ముందుకెళ్తామని, పెద్దపల్లి మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని పెద్దపల్లి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొలిపాక శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని శపథం చేశారు. పెద్దపల్లి తెనుగువాడలో మున్సిపాలిటీలోని 36 మంది టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కౌన్సిల ర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు కలిసి 18వ వార్డు కౌన్సిలర్‌ కొలిపాక శ్రీనివాస్‌ను మంగళవారం టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన శ్రీనివాస్‌ను కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు శ్రీనివాస్‌ జన్మదినం సందర్భంగా కౌన్సిలర్ల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఫ్లోర్‌లీడర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌ సహాయ, సహకారాలతో పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలతోపాటు హరితహారం, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. అన్ని వార్డుల్లో సమాన అభివృద్ధి జరిగే విధంగా చూస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి ప్రోత్సాహంతో వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మున్సిపాలిటీ పరిధిలోని గడపగడపకూ చేరేలా కౌన్సిలర్లమంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ప్రజల సహా య, సహకారాలతో వార్డులను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు దేవనంది రామాదేవి, సుద్దాల అమీరిశ్‌, నూగిళ్ల మల్లయ్య, తూముల సుభాష్‌రావు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఉప్పు రాజు, పెద్ది వెంకటేశ్‌, సునీల్‌, కొలిపాక సంధ్యా చిరంజీవి, అశ్రప్‌, ప్రశాంత్‌, తాడూరి శ్రీమాన్‌, పైడ రవి, సాబీర్‌ఖాన్‌, శ్రీనివాస్‌, పాగాల సోని శ్రీకాంత్‌ పాల్గొన్నారు.