ఆదివారం 29 నవంబర్ 2020
Peddapalli - Aug 26, 2020 , 02:26:42

బసంత్‌నగరే అనుకూలం

బసంత్‌నగరే అనుకూలం

  • lవిమానాశ్రయం ఏర్పాటుకు అనువైన స్థలం
  • lరాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం  lఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 

పెద్దపల్లి నమస్తేతెలంగాణ/పాలకుర్తి: బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి విమానాలు నడిచాయని గుర్తు చేశారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో విమానాశ్రయం నిర్మించే ప్రాంతాన్ని మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, కేశోరాం సిమెంటు కార్మాగారాలు ఉండడంతోపాటు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లా కేంద్రాలు అతి సమీపంలో ఉన్నాయని పేర్కొ న్నారు. విమానాశ్రయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని చెప్పారు. అంతర్గాం మండల కేంద్రంలో మినీ ఇండస్ట్రీ, పాలకుర్తిలో ఎయిర్‌పోర్టు నిర్మించడంతో నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వ్యాళ్ల అనసూర్య, మేడిపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, వైస్‌ఎంపీపీ ఎర్రంస్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.