సోమవారం 23 నవంబర్ 2020
Peddapalli - Aug 25, 2020 , 03:48:53

ఇంటింటా చేపల పులుసే

ఇంటింటా చేపల పులుసే

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ : మంథని మండలం సుందిళ్లలోని పార్వతీ బరాజ్‌ గేట్లు మూసి వేయడంతో ఆదివారం మధ్యాహ్నం తర్వాత పుష్కలంగా చేపలు లభించాయి. గేట్ల దిగువన కుప్పల కొద్దీ దర్శనమిచ్చాయి. ఈ విషయం దవానంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజ లు జాతరలా తరలివచ్చారు. పిల్లాపెద్దా అంద రూ కదిలారు. సోమవారం సాయంత్రం వరకు చేపలను పట్టుకున్నారు. ఒక్కొక్కరు కిలోల కొద్దీ పట్టుకొని, తమ ఇండ్లకు తీసుకెళ్లారు. బస్తాల్లో నింపుకొని మరీ వెళ్లారు. ఆది, సోమవారాల్లో బరాజ్‌ వద్ద దాదాపుగా ఏడు టన్నుల వరకు పట్టుకొని వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. మొత్తంగా బరాజ్‌ చుట్టుపక్కల గ్రామాలైన పోతా రం, విలోచవరం, గుంజపడుగు, ఉప్పట్ల, చిల్లపల్లి, బెస్తపల్లి, దుబ్బపల్లి, లక్కేపూర్‌, ఆరెంద, వెంకటాపూర్‌, ఖాన్‌సాయిపేట, సిరిపురం, నా గారం, కన్నాల, మంథని, పుట్టపాక, రచ్చపల్లి, అక్కెపల్లి, సూరయ్యపల్లి, ఎక్లాస్‌పూర్‌, రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి, పెద్దంపేట, జల్లారం, గోదావరిఖని, యైటిైంక్లెన్‌కాలనీతోపాటు మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కిష్టంపేట, కుందా రం, శివ్వారం, పౌనూరు, వేళాల, నర్సింగాపు రం, ఇందారం, భీమారం గ్రామాలు చేపల వం టకాలతో ఘుమఘుమలాడాయి. ఆదివారం రాత్రి నుంచే ఏం ఇంట్లో చూసినా జిమ్మల కూర లే కనిపించాయి. కిలోల కొద్దీ చేపలను తెచ్చుకున్న గ్రామస్తులు ఎవరికి వారే శుభ్రం చేసుకున్నారు. కొందరు తొక్కులు కూడా పెట్టుకున్నా రు. పులుసు, ఫ్రై ఇలా తీరొక్క వంటలను చేసుకొని కుటుంబ సభ్యులంతా కలిసి ఆరగించారు. కొందరేమే తమ బంధువులను ఇండ్లకు పిలిచా రు. మరికొందరు పక్క ఊళ్లలోని బంధువులకు చేపలను పంపించారు. మిగిలిన చేపలను ఏం చేయాలో తెలియక వరుగుల కోసం శుభ్రం చేసి ఆరబెట్టుకున్నారు.