సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Aug 22, 2020 , 01:36:44

ఆడబిడ్డలకు సర్కారు అండ

ఆడబిడ్డలకు సర్కారు అండ

కార్పొరేషన్‌:  తెలంగాణ ప్రభుత్వం  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అమలు చేస్తూ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉద్ఘాటించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం 176 మంది లబ్ధ్దిదారులకు రూ. 1.72 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  బడుగుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. అర్హులందరూ అభివృద్ధి పథకాలను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్రరాజు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య, ప్యాక్స్‌ చైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు వేల్పుల నారాయణ, సుధగోని మాధవి, జమీలుద్దీన్‌, సుంకిశాల సంపత్‌రావు, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.