గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Aug 22, 2020 , 01:36:59

ప్రజల విశ్వాసాన్ని పొందాలి

ప్రజల విశ్వాసాన్ని పొందాలి

ఫర్టిలైజర్‌సిటీ: శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కఠినంగా వ్యవహరించాలని, ప్రజల వి శ్వాసం చూరగొనేలా పని చేయాలని రామగుం డం సీపీ సత్యనారాయణ సూచించారు. శుక్రవా రం కమిషనరేట్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. తీవ్రమైన నేరాల దర్యాప్తులో ప్రణాళికలు అమలు చేయాలన్నారు. కేసుల విచారణలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. పాత, కొత్త నేరాలు, సోషల్‌ మీడియాపై నిఘా ఉంచాలన్నారు. షీ టీంను బలోపేతం చేసి మహిళల్లో మనోధైర్యం నింపాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. తీవ్రమైన కేసుల్లో పరిశోధన త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. సైబర్‌ క్రైం నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకొని కోర్టు ద్వారా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. డయల్‌ 100 ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా పని చేయాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో గణేశ్‌ మండపాలకు ఎలాం టి అనుమతులు లేవని, శనివారం ప్రారంభమ య్యే నవరాత్రోత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు, సి బ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్‌ మాస్కులు, గ్లౌసులు వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అడ్మిన్‌ అడిషనల్‌ డీసీపీ అశోక్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.