మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Aug 20, 2020 , 03:33:55

వడ్డెర కాలనీలో పర్యటించిన చైర్మన్‌

వడ్డెర కాలనీలో పర్యటించిన చైర్మన్‌

కొత్తపల్లి : ఇటీవల కురిసిన భారీ వర్షానికి మున్సిపల్‌ పరిధిలోని శివారు కాలనీలు జలమయంగా మారాయి. వర్షం నీటితో కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్‌ రుద్ర రాజు దృష్టికి తీసుకురాగా ఆయన బుధవారం 4వ వార్డు వడ్డెర కాలనీలో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలుపగా మున్సిపల్‌ సిబ్బందిని పిలిపించి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయించారు. మురికి కాలువలు, నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక్కడ శ్రీకాంత్‌, అధికారులు ఉన్నారు.