మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Aug 20, 2020 , 03:33:56

మట్టి గణపతులనే ప్రతిష్టించాలి

మట్టి గణపతులనే ప్రతిష్టించాలి

కరీంనగర్‌ హెల్త్‌ : మట్టి గణపతులనే ప్రతిష్టించాలని జై గణేశ్‌ భక్తి సమితి సభ్యులు అన్నారు. బుధవారం వారు కలెక్టర్‌ శశాంకను కలిసి మట్టి గణపతులను అందించారు. పర్యావరణాన్ని రక్షించాలని, ఇండ్లలో మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజలు చేయాలని కోరారు. కలెక్టర్‌తో పాటు సీపీ కమలాసన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతికి కూడా మట్టి గణపతులను అందజేశారు.  కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు అక్కినపల్లి నాగరాజు, కోశాధికారి రాచమల్ల భద్రయ్య, ఉపాధ్యక్షులు నలమాచు విజయప్రసాద్‌, రాచమల్ల కిరణ్‌, కొలిపాక శ్రీనివాస్‌, పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజులత, సునీత, తదితరులు పాల్గొన్నారు.